‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ ‘రాకా’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ రోజు ఒక ప్రత్యేక అప్‌డేట్ ఇస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో, అభిమానులు ఉదయం నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ సర్ప్రైజ్‌ను వెల్లడించాలని కోరుతూ సోషల్ మీడియాలో అభిమానులు ‘సన్ పిక్చర్స్’ (Sun Pictures) ను కోరుతున్నారు.
ఐతే, ప్రకటన సమయం మరియు వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ గోప్యంగా ఉంచడం వల్ల, సినిమా ప్రేమికుల్లో ఈ అప్ డేట్ పై కుతూహలం మరింత పెరుగుతుంది. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మొత్తానికి ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.


