‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!

‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!

Published on Aug 1, 2026 2:00 AM IST

Toxic-Movie

రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ కారణంగా అభిమానుల్లో ఈ మూవీపై కాస్త ఆందోళన ఏర్పడింది. చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూసి వారు ఆందోళనకు గురయ్యారు. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా యష్ పై వారికి పూర్తి కాన్ఫిడెన్స్ ఏర్పడింది.

ఇటీవల విడుదలైన ‘రామాయణ’ ట్రైలర్‌లో రాకింగ్ స్టార్ యష్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. రావణాసురుడిగా ఆయన పవర్‌ఫుల్ లుక్, నటన ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పాజిటివ్ టాక్ ‘టాక్సిక్’కి బాగా ప్లస్ కానుంది. ఆగస్టు 26న రాబోతున్న ఈ సినిమా లేట్ అవ్వడం వల్ల, ముఖ్యంగా హిందీలో పెద్ద అంచనాలు లేకుండా పోయాయి.

కానీ రామాయణ ట్రైలర్‌తో యష్‌పై ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆయన నటించే ‘టాక్సిక్’ సినిమాపై కూడా అందరిలోనూ ఆసక్తి మొదలైందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు