‘చైనా పీస్’ టైటిల్ మార్పు.. ‘సీక్రెట్ సోల్జర్’గా నిహాల్, సూర్య శ్రీనివాస్‌ల స్పై డ్రామా!

‘చైనా పీస్’ టైటిల్ మార్పు.. ‘సీక్రెట్ సోల్జర్’గా నిహాల్, సూర్య శ్రీనివాస్‌ల స్పై డ్రామా!

Published on Aug 3, 2026 2:00 PM IST

నిహాల్ కొదటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై డ్రామాకు సంబంధించి చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా మారుస్తున్నట్లు వెల్లడించింది.

గతంలో ‘చైనా పీస్’ అనే పేరుతో ప్రకటించిన ఈ చిత్రానికి ఇప్పుడు ‘సీక్రెట్ సోల్జర్’ అని పేరు ఖరారు చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. వినూత్నమైన కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకవర్గంలో ఆసక్తిని పెంచింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ పూర్తి కావడంతో ‘సీక్రెట్ సోల్జర్’ను సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సురేష్ రగుతు ఛాయాగ్రహణం అందించగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు