‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!

‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!

Published on Aug 5, 2026 6:56 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల కంటే ఒక రోజు ముందే గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక పెయిడ్ ప్రిమియర్ షోలను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రిమియర్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

​మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి బజ్ ఏర్పడటమే కాకుండా, విడుదలకు ముందే ఈ చిత్రం సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్య, దక్షా నగార్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

​యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

తాజా వార్తలు