విడుదల తేదీ : ఆగస్టు 07, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, వీటివి గణేష్, బుల్లిరాజు తదితరులు.
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
సంగీతం : ఎస్. థమన్
నిర్మాతలు : రాజీవ్ రెడ్డి ఎడుగురు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి కటసాని
ఎడిటింగ్ : సత్య జి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఇండో కొరియన్ హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్. సత్య ప్రధాన పాత్రలో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:-
కొరియాలో చనిపోయిన ఓ వ్యక్తి అస్థికలు ఓ కుక్ ద్వారా అనుకోకుండా ఇండియాకి చేరుకుంటాయి. పెనుకొండ ప్రాంతంలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్) పెద్ద కోపిష్టి. కనకరాజు స్నేహితుడు కిష్టప్ప (సత్య). తన ముందు అన్యాయం జరిగితే కనకరాజు ఎదురు తిరుగుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కనకరాజుకి లోకల్ రౌడీలతో గొడవ జరుగుతుంది. మరోవైపు కియా కంపెనీలో పని చేసే అమ్మాయి చైత్ర (రితికా నాయక్)ని చూసి కనకరాజు ప్రేమలో పడతాడు. ఆమె కూడా కనకరాజుకి కనెక్ట్ అవుతుంది. అయితే, ఓ ఆత్మ కారణంగా కనకరాజు లైఫ్ టర్న్ అవుతుంది. కొరియా వెళ్ళాల్సి వస్తోంది. అసలు ఆ ఆత్మ ఎవరిది ?, గతంలో అతను ఎలాంటి వాడు ?, కనకరాజు బాడీలో ప్రవేశించిన ఆత్మ కోరిక ఏమిటి ?, ఆ ఆత్మ కోసం వెళ్లి కనకరాజు ఎలా బుక్ అయ్యాడు ?, చివరకి ఈ కథ ఎలా మలుపు తిరిగింది? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
మరో దేశానికి చెందిన ఆత్మ.. ఓ తెలుగు కోపిష్టి కుర్రాడి బాడీలో చేరితే.. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ హారర్ కామెడీ డ్రామాలో కామెడీ ఎలిమెంట్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ‘‘కొరియన్ కనకరాజు’’ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన కనకరాజు పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఆత్మ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సత్య పాత్ర.. ఈ పాత్ర చుట్టూ వచ్చే కామెడీ సీన్స్…ఇలా మొత్తానికి ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా మెప్పించాడు. హీరోయిన్ రితికా నాయక్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సత్య కూడా బాగా నటించారు. తన కామెడీతో సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. బుల్లిరాజు నటన బాగుంది. ఇక వీటివీ గణేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ కొత్త నేపథ్యంలోనే కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంది. మెయిన్ గా హారర్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే, పతాక సన్నివేశాల్లోని మలుపులు బాగున్నాయి. ఇక కామెడీ సీన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ కొరియన్ కనకరాజు సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ ను పెట్టడం బాగుంది. దీనికి తోడు, కామెడీ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే.. సినిమా మొదట్లో కాన్ ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అదే విధంగా సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న హారర్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది. కథనం ఇంకా ఆసక్తికరమైన ప్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. మొత్తానికి మేర్లపాక గాంధీ దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు ఎస్. థమన్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. సత్య ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘కొరియన్ కనకరాజు’ అంటూ వచ్చిన ఈ హారర అండ్ కామెడీ డ్రామాలో.. హారర్ అండ్ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. వరుణ్ తేజ్, సత్యల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. ఐతే, స్క్రీన్ ప్లేలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, కొన్ని చోట్ల ప్లే స్లో కావడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం బాగానే ఆకట్టుకుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team


