ఈ శుక్రవారం దక్షిణాది బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ కలయికలో వచ్చిన చిత్రం సాలిడ్ ఫన్ అండ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఒకటి. అలాగే దీనితో పాటుగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘డిసి’ కూడా ఒకటి.
దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ గా ఒకే పేరు ఈ రెండు సినిమాలని కలపడంతో ఈ క్లాష్ మరింత ఆసక్తిగా మారింది. కానీ సీన్ కట్ చేస్తే అటు కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్, ఇటు ‘డిసి’ చిత్రంతో లోకేష్ కనకరాజ్ ఇద్దరూ తమ ఖాతాలో సాలిడ్ టాక్ అండ్ మంచి ఓపెనింగ్స్ ని ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు.
పలు ప్లాప్ ల తర్వాత కొరియన్ కనకరాజు తో మంచి బజ్ ని రేకెత్తించి మంచి బుకింగ్స్, హౌస్ ఫుల్ ప్రీమియర్స్ తో వరుణ్ తేజ్ మంచి వెల్కమ్ అందుకోగా డిసి సినిమాకి కూడా తమిళ్ సహా తెలుగులో కూడా సాలిడ్ టాక్ పడింది. దీనితో ఈ ఫ్రైడేకి మాత్రం ఇద్దరు కనకరాజులూ కొట్టేశారని చెప్పవచ్చు. ఫుల్ రన్ లో ఈ సినిమాలు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో నెక్స్ట్ చూడాలి.


