కొరియన్ కనకరాజు వివాదం.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..!

కొరియన్ కనకరాజు వివాదం.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..!

Published on Aug 7, 2026 11:02 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తాజా చిత్రం ‘కోరియన్ కనకరాజు’పై తలెత్తిన వివాదంపై స్పందించాడు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తమకు లేదని, కేవలం ఇమిటేషన్ మాత్రమే చేశామని, అంతేకానీ ఎవరినీ అవమానించలేదని స్పష్టం చేశాడు.

ఈ దృశ్యాలను గతేడాది నవంబర్‌లోనే చిత్రీకరించామని తెలిపిన ఆయన, గతంలో కూడా తన సినిమాల్లో పలువురు అగ్ర స్టార్స్ ని అనుకరించిన విషయాన్ని గుర్తుచేశాడు. సినిమా ప్రచారంలోని కొన్ని అంశాలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం మొదలైందని, కేవలం కొన్ని క్లిప్పింగ్స్‌ను చూసి సినిమాపై ఒక అంచనాకు రావద్దని ప్రేక్షకులను కోరాడు.

​సోషల్ మీడియాలో ఈ ప్రచార అంశాలపై భిన్నమైన చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, వరుణ్ తేజ్ మౌనంగా ఉండకుండా నేరుగా స్పందించి విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఇక పెయిడ్ ప్రిమియర్స్‌తో విడుదలైన ‘కోరియన్ కనకరాజు’ చిత్రం ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, రితిక నాయక్, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు