‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?

‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?

Published on Aug 8, 2026 4:18 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో మహేష్, జక్కన్న వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే, మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా ట్రీట్ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. కానీ, వారణాసి మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో అసలు ఈ మూవీ నుండి బర్త్ డే ట్రీట్స్ వస్తాయా లేదా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, వారణాసి టీమ్ మాత్రం సైలెంట్‌గా మహేష్ బర్త్ డే ట్రీట్ ఇవ్వాలని భావిస్తోందట. దీని కోసం ఇప్పటికే వారణాసి మూవీకి సంబంధించి కొన్ని పోస్టర్స్ కూడా రెడీ చేసిందని.. వాటినే బర్త్ డే ట్రీట్‌గా ఇవ్వబోతుందని సినీ సర్కిల్స్ టాక్. మరి నిజంగానే వారణాసి టీమ్ నుంచి రాబోయే ట్రీట్ ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా వచ్చేస్తుందా..? అనేది చూడాలి.

తాజా వార్తలు