అవైటెడ్ ‘టాక్సిక్’ ట్రైలర్ కి టైం ఫిక్స్!

అవైటెడ్ ‘టాక్సిక్’ ట్రైలర్ కి టైం ఫిక్స్!

Published on Aug 8, 2026 10:05 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హీరోయిన్ గా తెరకెక్కించిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. యశ్ నుంచి కేజీయఫ్ లాంటి సంచలన సినిమాల తర్వాత చాలా కాలం గ్యాప్ కి వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకోపక్క ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ లెవెల్ రిలీజ్ ని ప్లాన్ చేసుకోగా టాక్సిక్ చిత్రం ట్రైలర్ కి మేకర్స్ నేడు రంగం సిద్ధం చేశారు.

బెంగళూరులో గ్రాండ్ గా ఈ ట్రైలర్ లాంచ్ ని ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ ట్రైలర్ ఆన్లైన్ లాంచ్ టైం ని ఫిక్స్ చేశారు. దీనితో ఈ ట్రైలర్ నేడు సాయంత్రం 7 గంటల 1 నిమిషానికి సోషల్ మీడియాని టేకోవర్ చేయనుంది. ఆల్రెడీ వచ్చిన ప్రతీ విజువల్ కంటెంట్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ ట్రైలర్ లో కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా యశ్ మరియు కే వి ఎన్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

తాజా వార్తలు