‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?

‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?

Published on Aug 9, 2026 8:01 PM IST

Varanasi

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్ట్ లోకల్ నుంచి ఇంటెర్నేషల్ మార్కెట్ లెవెల్ కి తన భారీ చిత్రం ‘వారణాసి’ తో వెళుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పాన్ ఇండియా క్రేజ్ సినిమాలు లేని సమయంలోనే మహేష్ బాబుది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా కటౌట్ అనే టాక్ ఎప్పుడు నుంచో ఉంది. సో అలాంటి హీరోకి ఏ సమయంలో ఏది జరగాలో అలానే అన్నట్టు వచ్చింది ‘వారణాసి’.

ఈ విషయం పక్కన పెడితే మహేష్ బాబు నుంచి ఈ సినిమా కోసం ఓకే.. నేడు తన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన రెండు సింపుల్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయం మాత్రం ఆశ్చర్యంగా మారిందని చెప్పాలి. జెనరల్ గా ఏ స్టార్ హీరో బర్త్ డే అయినా కూడా మినిమమ్ ఒక్క కొత్త సినిమా అయినా ఓ నిర్మాణ సంస్థ నుంచో దర్శకుని నుంచో కొలాబరేషన్ కోసం రివీల్ అవుతుంది.

కానీ ఇంట్రెస్టింగ్ గా ఈసారి బాబు బర్త్ డేకి ఇలాంటి హడావుడి ఏమాత్రం కనిపించలేదు. ఇది మాత్రం ఒకింత ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ చేసే అంశమే అని చెప్పాలి. మరి వారణాసి తర్వాతే మహేష్ తదుపరి సినిమాపై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు