‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!

Published on Aug 10, 2026 4:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.

ఇక ఈ చిత్రానికి కోయంబత్తూర్, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే ఆగస్టు 11న జరగబోయే తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అందరి దృష్టి నెలకొంది. కాగా ఈ సినిమాకు టికెట్ ధరపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ చిత్రానికి ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండబోదని వారు చెబుతున్నారు. దీంతో ప్రేక్షకులకి పెద్ద ఊరట లభించిందని చెప్పాలి.

ఫ్యామిలీ ఆడియెన్స్ భారీగా థియేటర్లకు వస్తారనే ధీమాతో చిత్రబృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా అలరించనుండగా రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు