‘జైలర్ 2’పై ఫోకస్ అప్పటి నుంచి?

‘జైలర్ 2’పై ఫోకస్ అప్పటి నుంచి?

Published on Aug 12, 2026 3:02 PM IST

Jailer2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు ‘ధర్మన్’ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ దీని కంటే ముందు చేసిన సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంకా వరుస అప్డేట్స్ బాకీ ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ గాని పాటలు విడుదల వగైరా అంశాలు చాలా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మేకర్స్ ‘డిసి’ ఫీవర్ తగ్గిన తర్వాత నుంచి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఎలాగో సినిమా అక్టోబర్ 15కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. సో మేకర్స్ ఫోకస్ ఈ నెలాఖరు నుంచి పెట్టాలని చూస్తున్నారట. ఆగష్టు ఎండింగ్ నుంచి జైలర్ 2 తాలూకా ప్రమోషన్స్ మొదలు పెట్టి సినిమా రిలీజ్ నాటికి మరింత హైప్ తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు