మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కి సాలిడ్ కంబ్యాక్ గా నిలిచి అదరగొట్టింది. ఇలా తన కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ తో నిలకడ కొనసాగిస్తుంది.
ఇలా బుక్ మై షో సహా డిస్ట్రిక్ట్ యాప్స్ లో కలిపి 9 లక్షల టికెట్ సేల్స్ వరకు వచ్చింది. ఇలా నెక్స్ట్ రికార్డు మార్క్ 1 మిలియన్ మార్క్ కి అతి చేరువ లోకి వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇది ఈ వీకెండ్ బుకింగ్స్ తో ఏమన్నా క్రాస్ చేస్తుందేమో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో కమెడియన్ సత్య సాలిడ్ ఫన్ అందించగా థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అలాగే ఈ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.
900K+ tickets sold for #KoreanKanakaraju on @bookmyshow
and @district_india
🤩🔥Racing towards 1M+ tickets and another Blockbuster Week💥💥💥
Book your tickets now for the NON STOP ENTERTAINER ❤️🔥@IamVarunTej @RitikaNayak_ @GandhiMerlapaka #Satya @MusicThaman #ManojhReddy… pic.twitter.com/E0FzT7Eidb
— UV Creations (@UV_Creations) August 12, 2026


