టాలీవుడ్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగాధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశి విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కెఆర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
పెయిడ్ ప్రిమియర్స్ ప్రారంభం
చిత్ర విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రిమియర్ షోలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అల్లు సినిమాస్‌లో ‘అగాధ’ పెయిడ్ ప్రిమియర్ షోల బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ (District) యాప్‌ల ద్వారా టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారు.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల (మహాదేవి పాత్రలో), శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భానుచందర్, రోషన్ బషీర్, షిజూ అబ్దుల్ రషీద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చమిడిశెట్టి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు లభించిన స్పందనతో ఈ మిస్టిక్ థ్రిల్లర్‌పై ఆసక్తి నెలకొంది.


