పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!

పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!

Published on Aug 12, 2026 9:31 PM IST

Slum-Dog

వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పూరీ బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడంతో పాటు నాన్-థియేట్రికల్ డీల్స్ ముగించే పనిలో ఉంది.

అయితే, విజయ్ సేతుపతికి తమిళంలో భారీ మార్కెట్ ఉన్నందున, తెలుగుతో పాటు తమిళంలోనూ సరైన సమయం చూసి ఒకేసారి విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. విజయ్ సేతుపతి నటించిన ఇతర తమిళ చిత్రాల విడుదల షెడ్యూల్ ఇప్పుడు పూరీ జగన్నాథ్ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతోంది. ఆయన నటించిన ‘ట్రైన్’ సినిమా సెప్టెంబర్‌కు వాయిదా పడగా, ‘బత్తా’ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

వచ్చే రెండు నెలల్లో ఈ రెండు చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రానుండటంతో, ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ విడుదలను వీటి తర్వాతే ప్లాన్ చేయాల్సి వస్తోంది. అనుకున్నట్లుగా ఆ రెండు సినిమాలు సెప్టెంబర్, అక్టోబర్ లలో రిలీజ్ అయితే, పూరీ-సేతుపతిల కాంబో సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు