‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?

‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?

Published on Aug 12, 2026 11:44 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫౌజీ’పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఏర్పడ్డాయి. అయితే, ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక గ్లింప్స్ లేదా టీజర్ విడుదలవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రమోషన్స్ వాయిదా పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

లండన్ నుండి రావాల్సిన ఒక కీలక నటుడి వీసా సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. టీజర్‌లో సదరు నటుడికి సంబంధించిన సన్నివేశాలను కూడా చేరిస్తే ప్రమోషన్స్‌కు మరింత ఇంపాక్ట్ వస్తుందని భావించిన మేకర్స్, గ్లింప్స్ విడుదలను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.

మరోవైపు ప్రభాస్ ఎలివేషన్ విజువల్స్, ఒక లిరికల్ సాంగ్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ‘ఫౌజీ’ వరల్డ్‌ను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనను కూడా పక్కన పెట్టారు. టీజర్ లేనప్పటికీ, ఆగస్టు 15న అభిమానులను అలరించేందుకు ఆల్టర్నేటివ్ ప్రమోషనల్ ప్లాన్‌ను సిద్ధం చేసే పనిలో చిత్ర బృందం ఉంది.

తాజా వార్తలు