‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?

‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?

Published on Aug 13, 2026 1:00 AM IST

raaka

‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ఇంపాక్ట్, సాధించిన క్రేజ్ అసాధారణమైనవి. ‘పుష్ప రాజ్’గా ఆయన చూపించిన మేనరిజమ్‌లు, నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాయి. ఆ ఇమేజ్ నుంచి ప్రేక్షకులను బయటకు తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. అయితే, దర్శకుడు అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో తీస్తున్న ‘రాకా’ చిత్రం ద్వారా ‘పుష్ప రాజ్’ ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేసి, ఆయనకు ఒక సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టే మిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలికలు ఉండవని సమాచారం. ‘రాకా’ చిత్రాన్ని ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా అట్లీ మలుస్తున్నాడు. ఇందులో బన్నీ ఒక ‘దివ్య యోధుడు’ పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అల్లు అర్జున్ గుండు, గ్రే హెయిర్ మరియు ప్రోస్తెటిక్ మేకప్‌తో సరికొత్త లుక్‌లోకి మారబోతున్నారు. దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు