DC ఒక తమిళ్ క్లాసిక్: మహేష్ బాబు తర్వాత ‘డీసీ’ మూవీకి అల్లు అర్జున్ ఫిదా

DC ఒక తమిళ్ క్లాసిక్: మహేష్ బాబు తర్వాత ‘డీసీ’ మూవీకి అల్లు అర్జున్ ఫిదా

Published on Aug 17, 2026 2:05 PM IST

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డీసీ’ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై స్పందించగా, టాలీవుడ్ అగ్ర కథానాయకులు కూడా చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘డీసీ’ చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఇదొక ఒరిజినల్, ఔట్‌స్టాండింగ్ మూవీ. సినిమాలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తమిళ్ క్లాసిక్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ‘డీసీ’ చిత్రాన్ని చూసి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రశంసించారు. “డీసీ సినిమా చూశాను. ఇదొక తమిళ్ క్లాసిక్. అర్థం చేసుకునే వారికి ఇదొక దృశ్య కావ్యం లాంటిది. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది” అని పేర్కొన్నారు.

అలాగే చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌పై గౌరవాన్ని వ్యక్తం చేసిన బన్నీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను ‘మాస్టర్ బూస్టర్’గా అభివర్ణించారు. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉందని, వామికా గబ్బితో పాటు నటీనటులందరూ చక్కగా నటించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, చిత్ర యూనిట్ మొత్తానికి అల్లు అర్జున్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు