సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ప్రకటించిన ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షోకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఈ పాపులర్ కుకింగ్ షో సోనీ విజా, సోనీ లివ్‌లలో ప్రసారం కానుంది.
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ప్రకటించిన ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షోకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పాపులర్ కుకింగ్ షో సోనీ విజా, సోనీ లివ్‌లలో ప్రసారం కానుంది. బనిజె ఏషియా నిర్మిస్తోన్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ను తమిళ నేటివిటీ, లోకల్ ఫ్లేవర్స్ మరియు సెలబ్రిటీల కెమిస్ట్రీకి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షో సోనీ విళా, సోనీ లివ్‌లలో అందుబాటులోకి రానుంది. మెయిన్ ఎపిసోడ్స్‌తో పాటు సెలబ్రిటీల కుకింగ్ జర్నీ, కిచెన్ ఛాలెంజెస్ మరియు ఇంట్రెస్టింగ్ మూమెంట్స్‌ను కవర్ చేసే ప్రత్యేక షార్ట్ ఫార్మ్ కంటెంట్‌ను కూడా ప్రేక్షకులకు అందించనున్నారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “ఈ షో చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నేను చేసిన వాటిలో ఇది చాలా డిఫరెంట్, అందుకే నో చెప్పలేకపోయాను. ఫుడ్‌కు మనుషులను కలపడమే కాక మనలోని మరో కోణాన్ని బయటకు తీసే శక్తి ఉంది. తమిళ సెలబ్రిటీలు కిచెన్‌లో రిస్క్‌లు తీసుకుంటూ, ప్యాషన్‌తో పోటీపడటం చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. ఎవరు పాల్గొంటున్నారనేది సర్ ప్రైజ్. సోనీ విళాతో కలిసి అందించబోయే ఈ ఫన్‌ను ఎంజాయ్ చేయండి.” అన్నారు.
సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. ‘తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రముఖులు పాల్గొనే ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’.. ఫుడ్, కాంపిటీషన్ మరియు తమిళ సంస్కృతి కలబోతగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.’
‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ త్వరలోనే సోనీ విళా, సోనీ లివ్‌లోకి రానుంది. డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ షోకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది.


