టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్ సంగీత్ శోభన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తు దూసుకెళ్తున్నాడు. నేడు(ఆగస్టు 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి పలు అప్డేట్స్ ఇచ్చాడు సంగీత్ శోభన్. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ‘కుమారి 21F’ ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో రూపొందించేందుకు రెడీ అయ్యాడు.
ఈ చిత్రంలో సంగీత్ శోభన్ మారుతి అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘మా మారుతికి హ్యాపీ బర్త్ డే’ అంటూ మేకర్స్ ఈ చిత్రం నుంచి సంగీత్ శోభన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రానుందనే సంకేతం లభిస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ కొత్త కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, వల్లభనేని గిరిబాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


