‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!

‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!

Published on Aug 19, 2026 2:28 PM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లు హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. మంచి హైప్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు.

ఈ ఆగష్టు 22న హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ అందించారు. ఇక ఈ ఈవెంట్ కి యష్ సహా సినిమా ప్రధాన స్టార్ కాస్ట్ అంతా వస్తున్నట్టుగా సాలిడ్ ప్రోమో కట్ కూడా వదలడం విశేషం. సో ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ అలాగే యష్ కూడా నిర్మాణం వహించారు. ఈ ఆగష్టు 26న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు