లేడీ సూపర్ హీరో ‘మహాకాళి’ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

లేడీ సూపర్ హీరో ‘మహాకాళి’ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

Published on Aug 19, 2026 7:00 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకంటూ సెపరేట్ సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా తన సినిమాటిక్ యూనివర్స్ ని హను మాన్ తో స్టార్ట్ చేయగా, ఇది తెలుగు సినిమా నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే లేడీ సూపర్ హీరో సినిమా కూడా ప్రశాంత్ వర్మ నుంచే రాబోతుంది. యువ నటి భూమి శెట్టి లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన పాత్రే ‘మహాకాళీ’. దర్శకురాలు పూజా కొల్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధురంధర్ నటుడు అక్షయే ఖన్నా సాలిడ్ రోల్ చేస్తున్నారు.

అయితే నేడు ప్రశాంత్ వర్మ సినిమా సెట్స్ నుంచి అక్షయేపై సినిమా స్టిల్ వదిలి ఈ ఆగష్టు 24న బిగ్ అప్డేట్ వదులుతున్నట్టు ఖరారు చేశారు. ఆరోజున సినిమా తాలూకా గ్లింప్స్ రానున్నట్టు బాలీవుడ్ వర్గాలు ఖరారు చేసాయి. అలాగే రిలీజ్ డేట్ కూడా అందులోనే అనౌన్స్ కానున్నట్టుగా టాక్. సో దీనిపై అప్పుడే ఓ క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు