మాస్ రాజా రవితేజకు సరైన కంటెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విజృంభణ ఏ రేంజ్లో ఉంటుందో ‘ఇరుముడి’ నిరూపిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏపీ, తెలంగాణల్లోని బిగ్ సిటీస్ నుంచి బి, సి సెంటర్ల వరకు ప్రతి చోటా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో, కేవలం మొదటి వీకెండ్లోనే బయ్యర్లు లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 24 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. రవితేజ గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టోటల్ రన్ కలెక్షన్లను ‘ఇరుముడి’ ఒక్క రోజే దాటేయడం గమనార్హం. సాధారణ మాస్ చిత్రాలకు భిన్నంగా ఆకట్టుకునే ఎమోషన్స్, బలమైన కథనం, ముఖ్యంగా అయ్యప్ప స్వామి సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచే దిశగా దూసుకుపోతోంది.


