రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ కోసం అందరికీ తెలిసిందే. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విషయంలో చాలామంది సందేహ పడ్డారు కానీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్రేడ్ అంతటికీ షాకిచ్చింది. కేవలం 24 గంటల్లోనే బుక్‌మైషోలో 3.35 లక్షల టికెట్ల మార్కును దాటి, భారీ ఓపెనింగ్ పై కన్నేసింది.
ఈ చిత్రాన్ని దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటంతో తెలుగు మార్కెట్ కూడా భారీ స్పందనకు సిద్ధమవుతోంది. ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్ల జోరు మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ వంటి భారీ తారాగణంతో కూడిన ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, యష్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ ఆగస్టు 26న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


