ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!

ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!

Published on Aug 23, 2026 2:24 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈసారి పుట్టినరోజు మాత్రం మంచి అట్టహాసంగా ముగిసింది. అభిమానులు కోరుకున్న సాలిడ్ హై తో ముగిసిన ఈ బర్త్ డే కి దర్శకుడు బాబీ ఇచ్చిన కాకా ట్రీట్ అదిరింది. అయితే మెగాస్టార్ సినిమా నుంచి వీరు వదిలిన ట్రీట్ కేవలం శాంపిల్ అని బాబీ చెబుతున్నాడు. మెయిన్ గా థమన్ వర్క్ రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరినీ మరింత థ్రిల్ చేయబోతోంది అని తను ప్రామిస్ చేస్తున్నాడు.

సో మ్యూజిక్ పరంగా డాకు మహరాజ్ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ దుమ్ము రేపనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో యువనటి అనస్వర రంజన్ మెగాస్టార్ కూతురు పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కే వి ఎన్ నిర్మాణ సంస్థ తెలుగులో తమ మొదటి సినిమాగా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. గ్రాండ్ గా ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు