‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?

‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?

Published on Aug 23, 2026 7:00 AM IST

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ – నారా రోహిత్ మధ్య ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. అలాగే హైడ్ అండ్ సిక్ ట్రాక్ శైలిలో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా కూడా ఉంటుందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే నారా రోహిత్ ఎంట్రీ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు