‘మాస్ మహారాజా’ రవితేజ తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ కొత్త అవతారం అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా విడుదలైన సుమారు 40 గంటల్లోనే ‘ఇరుముడి’ అనేక ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ సాధించింది. ప్రస్తుత థియేటర్స్ మార్కెట్ చూసుకుంటే.. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘనతే. మరోవైపు టికెట్ అమ్మకాలు జోరుగా సాగుతుండటం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో శనివారం మిడ్ నైట్ షోలు కూడా ‘హౌస్‌ఫుల్’ అవుతున్నాయి. కొన్నిచోట్ల టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారింది. మొత్తానికి ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన అపూర్వమైనది. రవితేజ కెరీర్లోనే ఇది అత్యుత్తమ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. తొలి రోజు గ్రాస్ వసూళ్లు రూ. 25 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. విపరీతమైన డిమాండ్ మరియు పాజిటివ్ టాక్ కారణంగా, శనివారం నాటి వసూళ్లు మొదటి రోజు కంటే గణనీయంగా పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అన్నిటికీ మించి రవితేజ సినీ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 150 – 200 కోట్ల లైఫ్ టైమ్ గ్రాస్ సాధించే అవకాశం ఉంది. అప్పుడు రవితేజకు అద్భుతమైన థియేట్రికల్ విజయం అవుతుంది. మరి ఈ సినిమా రూ. 200 కోట్ల మార్కు వైపు దూసుకెళ్లి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందా ? లేదా ? అనేది రాబోయే రోజుల్లో చూడాలి.


