యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !

యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !

Published on Aug 23, 2026 10:03 AM IST

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. ఆగస్టు 26, 2026న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు ప్రసంగిస్తూ, భవిష్యత్తులో యశ్తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కలయిక ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్న తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది ఒక ఉత్సాహభరితమైన వార్త. అయితే, యశ్ కున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా టైమ్ పట్టవచ్చని కూడా దిల్ రాజు సూచించారు.

ఇంతకీ, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు ?, రాకింగ్ స్టార్ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారు ?, అసలు యశ్ కోసం దిల్ రాజు ఎలాంటి కథను తీసుకురాబోతున్నారు ? అనే అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరోవైపు, యశ్ చేతిలో ఇప్పటికే అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి; ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకి మరో రెండు మూడేళ్లు సమయం పట్టొచ్చు. ఈ లోపు టాక్సిక్ రూపంలో వీరిద్దరి కలయికలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టాక్సిక్ సినిమా పంపిణీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు