బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?

బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?

Published on Aug 23, 2026 11:02 PM IST

నట సింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో సాలిడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈపాటికే చాలా షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో బాలయ్యకి చిన్నపాటి గాయం కావడం మూలాన గ్యాప్ రావాల్సి వచ్చింది. దీనితో ఈ గ్యాప్ మూలాన సినిమా విడుదల ప్లాన్ లు ఏమన్నా మారి ఉంటాయేమో అని చాలా మంది భావించారు.

అయితే మొదట బాలయ్య 111 ని ఈ దసరా బరికి అనుకున్నారు కానీ అది డిసెంబర్ మొదటి వారానికి షిఫ్ట్ అయ్యింది. అయితే అనుకోని విధంగా వచ్చిన గ్యాప్ మూలాన డిసెంబర్ నెలాఖరుకి సినిమా షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. క్రిస్మస్ బరిలో బాలయ్య మాస్ బొమ్మ రాబోతుందట.

అయితే ఇదే రేస్ లో పలు క్రేజీ హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. పైగా తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ కూడా వాటిపై ఎంతో ఉంది. సో కాంపిటీషన్ మాత్రం అపుడు గట్టిగానే వుంటుంది అని చెప్పవచ్చు. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

తాజా వార్తలు