సెప్టెంబర్ 4న ‘మా రాముడు అందరివాడు’ విడుదల

సెప్టెంబర్ 4న ‘మా రాముడు అందరివాడు’ విడుదల

Published on Aug 23, 2026 9:00 PM IST

యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. అనుముల ప్రొడక్షన్స్ పతాకంపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి 2 గంటల 2 నిమిషాల 30 సెకన్ల రన్‌టైమ్ ఖరారైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

సామాజిక అంశాలకు మైథలాజికల్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తండ్రి కన్న కల అయిన ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, గ్రామంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కథానాయకుడు సాగించే పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ కథలో వచ్చే హనుమంతుడి పాత్రకు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం.

ఈ చిత్రంలో శ్రీరాములు, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, అప్పారావు, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మనీష్ కుమార్ సంగీతం సమకూర్చగా, బొల్ల వెంకటేష్ నేపథ్య సంగీతం అందించారు. చిత్రంలోని ఐదు పాటలను నజీర్ ఉద్దిన్, గీతా మాధురి, రమ్య బెహరా, నల్గొండ గద్దర్ ఆలపించారు.

తాజా వార్తలు