‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..

‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..

Published on Aug 27, 2026 2:02 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ కంబ్యాక్ హిట్ చిత్రమే ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే స్యూర్ షాట్ హిట్ గ్యారెంటీ వైబ్స్ ని సెట్ చేసుకుంది. ఇలా విపరీతమైన పాజిటివ్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా దగ్గర గుర్తుండిపోయే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది.

ఇక ఈ సినిమా విషయంలో సినీ ప్రముఖులు నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇటీవల రామ్ చరణ్, రష్మిక మందన్నాలు ప్రశంసలు కురిపించగా లేటెస్ట్ గా లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూ పంచుకోవడం వైరల్ గా మారింది. నా ప్రియమైన తమ్ముడు రవితేజ ‘ఇరుముడి’తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

త్రినాద్ పాత్రని నీ భుజ స్కందాలపై పెట్టుకుని ఒక ఫినానిమల్ పెర్ఫామెన్స్ ని చేసావు. మొదటి నుంచి చివరి వరకు సినిమాని ఎంతో ఎంజాయ్ చేశాను. దర్శకుడు శివ నిర్వాణ ఇలాంటి డెప్త్ ఉన్న సబ్జెక్టుని అద్భుతంగా తీశారు. బేబీ నక్షత్రకి ఉజ్వల భవిష్యత్తు ఉంది, మొత్తం సినిమా యూనిట్ అందరికీ శుభాకంక్షాలు తెలియజేస్తున్నాను అని మైత్రి నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని లకి కూడా బెస్ట్ విషెస్ అందించారు.

అయితే చివరిలో మాత్రం “ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! అంటూ ముగించడం కొసమెరుపుగా మారింది. దీనితో మెగాస్టార్ ఈ లైన్స్ ఏ ఉద్దేశంతో చెప్పారో అనే డిస్కషన్ కూడా కామెంట్స్ లో మొదలైంది. మొత్తానికి అన్నయ్య నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ఫీడ్ బ్యాక్ రావడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు