గ్లింప్స్ టాక్: ‘కింగ్ 100’ తో నాగ్ మనీ గేమ్.. విడుదల తేదీ ఖరారు!

గ్లింప్స్ టాక్: ‘కింగ్ 100’ తో నాగ్ మనీ గేమ్.. విడుదల తేదీ ఖరారు!

Published on Aug 29, 2026 12:03 PM IST

మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా ఇప్పుడు తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 100వ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని అభిమానులు సహా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎట్టకేలకి నేడు కింగ్ నాగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

ఇక ఇది మాత్రం అభిమానులు అంచనాలకి తగ్గకుండా ఇంకా చెప్పాలంటే రొటీన్ కి భిన్నంగా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. మనుషులు రెండు రకాలు అంటూ డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు అనే వ్యత్యాసం నుంచి మొదలు పెట్టి ఇందులో కింగ్ నాగ్ డబ్బుతో ఆడే ఆటగా దర్శకుడు కార్తీక్ చాలా స్టైలిష్ అండ్ రిచ్ విజువల్స్, టేకింగ్ తో ఇంప్రెస్ చేసారని చెప్పొచ్చు.

నాగార్జున అదే హ్యాండ్సమ్ అవతార్ లో ఇంకా యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఇందులో దేవిశ్రీ ప్రసాద్ స్కోర్ కూడా మంచి రిఫ్రెషింగ్ గా ఉండడం విశేషం. ఇలా ఒక స్టైలిష్ అండ్ మాస్ గ్లింప్స్ తో మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 24న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు