విడుదల తేదీ : ఆగస్టు 28, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : కికు యనమల, కాశీష్ ఖాన్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, తదితరులు.
దర్శకత్వం : శుభ సాయి వెంకట్
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాతలు : దీప్తి నాడిమింటి
ఛాయాగ్రహణం : రామకృష్ణ. పి
కూర్పు : చోటా కె. ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
చిరంజీవి (కికు) అలాగే మానస (కాశిష్ ఖాన్) లు ఇద్దరూ అనాథలే కానీ తమని తమ పెద్దలు (గోపరాజు రమణ రాజు, శ్రీకాంత్ భారత్) లు పెంచి పెద్ద చేస్తారు. మానసకి పెళ్లి చేసే క్రమంలో ఆమెకి దగ్గరయ్యే వాళ్ళని తనికెళ్ళ భరణి తన గ్యాంగ్ తో చంపిస్తూ ఉంటాడు. కానీ ఆమె చిరంజీవితో ప్రేమలో పడుతుంది. ఇక అక్కడ నుంచి వీరి ప్రేమ పెళ్లి వరకు కూడా వెళుతుంది. కానీ వారి ఫస్ట్ నైట్ తర్వాత మానస, చిరు విషయంలో ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. మరి ఆ నిజం ఏంటి? ఎందుకు తనికెళ్ళ భరణి ఆమెకి దగ్గరయ్యే వాళ్ళని చంపుతాడు? కానీ చిరుకి ఎందుకు ఏం కాలేదు? ఈ అంతటిలో హైదరాబాద్ లో సెటిల్డ్ వ్యాపారవేత్త (ఈశ్వరి రావు) కి లింక్ ఏంటి? ఈ ఉచ్చు నుంచి మానస ఎలా బయటపడింది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఇందులో కొన్ని చోట్ల థ్రిల్ మూమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఫస్టాఫ్ లో కథనం అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదు. మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్, అక్కడక్కడా మైంటైన్ చేస్తూ వెళ్లిన సస్పెన్స్ ఫ్యాక్టర్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ క్లైమాక్స్ పార్ట్ లో అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని ఇచ్చే క్లారిటీ కొంచెం తెలికపరుస్తుంది.
ఇక నటీనటులలో కికు తన రోల్ లో బాగానే చేసారు. మెయిన్ గా నెగిటివ్ షేడ్ లో తన పెర్ఫామెన్స్ బెటర్ గా ఉంది. తనతో పాటుగా యువ నటి కాశిష్ ఖాన్ కూడా మంచి పెర్ఫామెన్స్ చేసింది. నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆమె తన రోల్ కి కావాల్సిన ఎఫర్ట్స్ పెట్టింది.
అలాగే నటి ఈశ్వరి రావుని ఇటీవల లైట్ గా లెనిన్ లో నెగిటివ్ షేడ్ లో చూసాం. కానీ ఇందులో కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ గా కనిపించారు. తన రోల్ లో సర్ప్రైజ్ చేశారు. ఇక వీరితో పాటుగా శ్రీకాంత్ భారత్, గోపారాజు రమణ రాజు తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఒక డీసెంట్ కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది. కానీ దీనికి కావాల్సిన బలమైన కథనం మాత్రం కొంచెం మిస్ అయ్యింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పరిస్థితులు అన్నీ ఇందులో చాలా సింపుల్ గా ముగిసిపోతాయి. ఫస్టాఫ్ లో ఇవి ఎక్కువ కనిపించడంతో కథనం కొంచెం బలహీనంగా అనిపిస్తుంది.
హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ చాలా సింపుల్ గా ఉంది. ఇద్దరి మధ్య బలమైన కాన్ఫ్లిక్ట్ లేకుండానే ఈ ట్రాక్ ని ఫోర్సెడ్ గా అతికించినట్టు ఉంటుంది. అలాగే సెకండాఫ్ మొదలైన తర్వాత కూడా కథనం సాగదీతగా వెళ్ళింది. ఇక ఒక సమయం వచ్చాక పరిస్థితిలు కూడా చూసే ఆడియెన్ కి ఊహాజనితంగానే వెళ్లిపోతాయి.
ఇవి కాకుండా ఎక్కడో ప్లాట్ ‘రాక్షసుడు’ లోని క్రిస్టోఫర్ బ్యాక్ డ్రాప్ ని గుర్తు చేస్తుంది. అలానే పాటలు కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఇలా పలు అంశాలు మాత్రం ఇందులో బలహీనంగా కనిపించాయి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాత దీప్తి నడిమింటి నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో ఇవి సెటప్ కి తగ్గట్టుగా బాగా ప్లాన్ చేసుకున్నారు. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా క్లారిటీ గా కట్ చేయాల్సింది. కానీ కొన్ని పోర్షన్స్ లో మాత్రం తన వర్క్ బాగుంది.
ఇక దర్శకుడు శుభ సాయి వెంకట్ విషయానికి వస్తే.. తను ఎంచుకున్న సబ్జెక్ట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. పైగా చాలా వరకు సీన్స్ ని తను బాగా ఎస్టాబ్లిష్ చేశారు కూడా. ఉదాహరణకు ఫస్టాఫ్ లో హీరోయిన్ హీరోకి ఊపిరి ఇచ్చే సీన్, ఇంకోపక్క ఓ పసిబిడ్డ పుట్టే సీన్ ఇలాంటివి మరికొన్ని సీన్స్ ని తను బాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ మిస్ చేసారు. ఇలాంటి వాటిలో కూడా తాను మరింత కేర్ తీసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ ఔట్ పుట్ బెటర్ గా అనిపించేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ గా నిలిచింది. దర్శకుడు తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


