పవన్ X సందీప్ రెడ్డి వంగ? ఊహల్లో బతికేస్తున్న ఫ్యాన్స్?

పవన్ X సందీప్ రెడ్డి వంగ? ఊహల్లో బతికేస్తున్న ఫ్యాన్స్?

Published on Aug 30, 2026 7:09 PM IST

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. తనతో ఓ స్టార్ హీరో సినిమా అంటే జెనరల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అవ్వాల్సిందే. ఇలా ప్రస్తుతం సందీప్ వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా లైనప్ సిద్ధంగా ఉంది.

అనిమల్ 2 ఉంది, మహేష్ తో డెవిల్ ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యారు. కానీ ఈ అంతటిలో సందీప్ వంగ ఆరాధించే తన అభిమాన హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ఉంది అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఊహల్లో బతికేస్తున్నారని అనుకోవాలి. ఈ సెప్టెంబర్ 2న పవన్, సందీప్, టీ సిరీస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్సమెంట్ వస్తుంది అంటూ కొంచెం రియాలిటీకి దూరంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మరి వీటి అన్నిటికి ఆరోజే ఒక క్లారిటీ వస్తుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు