పిక్ టాక్ : ‘రోమాంచకం’ టీమ్‌కు ప్రభాస్ సపోర్ట్..!

పిక్ టాక్ : ‘రోమాంచకం’ టీమ్‌కు ప్రభాస్ సపోర్ట్..!

Published on Sep 2, 2026 5:07 PM IST

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రభాస్ వారి చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న ప్రభాస్ ‘రోమాంచకం’ పెద్ద బ్లాక్‌బస్టర్ అయి, స్పిరిట్ కలెక్షన్లను కూడా దాటేయాలని కోరాడు. డార్లింగ్ ప్రభాస్ అందించిన ఈ ఊహించని సపోర్ట్ అండ్ బెస్ట్ విషెస్‌తో ‘రోమాంచకం’ టీమ్ అమితానందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు