మన తెలుగు సినిమా వద్ద మ్యూజికల్ గా ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సంగీత దర్శకుడు రమణ గోగుల కలయిక కూడా ఒకటి. వీరి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాల మ్యూజిక్ అప్పట్లోనే అడ్వాన్స్డ్, ట్రెండీగా సాగి యువతని ఊపేసాయి. ఇక మళ్లీ ఎన్నో ఏళ్ళు తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. రమణ గోగుల సినిమాలు తగ్గించడం పవన్ కూడా ఇతర సంగీత దర్శకులుతో వర్క్ చేయడంతో అన్నవరం సినిమా తర్వాత దూరం పెరిగింది.
అక్కడ నుంచి వీరి కలయికలో పూర్తి ఆల్బమ్ కాకపోయినా, రమణ గోగులతో ఒక సాంగ్ అయినా పాడించాలని ఫ్యాన్స్ కోరుకునేవారు. అయితే ఇటీవల ఓజి సినిమాలో లెట్స్ గో జానీ రీమిక్స్ చేశారు. అయితే నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ త్వరలో కలిసి పని చేస్తే ఆనందంగా ఉంటుంది అని పోస్ట్ చేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల అభిమనులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరి మళ్లీ వీరి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో చూడాలి. థమన్ గతంలో చేసినట్లు కాకుండా ఈసారి కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తాడేమో కూడా చూడాల్సిందే.
My dear friend @PawanKalyan,
Wishing you a Happy Birthday! May your life be filled with lots of joy and success. We are so proud of all the amazing work you are doing as a political leader and the magic you continue to spin on the silver screen.
Would be awesome to collaborate…
— Ramana Gogula (@RamanaGogula) September 2, 2026


