స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం వాయిదా పడుతోందంటూ ఫిలిం నగర్‌లో వచ్చిన రూమర్లకు ప్రొడ్యూసర్ నాగవంశీ చెక్ పెట్టారు. సినిమా వాయిదా పడటం లేదని, ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
అభిమానులకు జరిగిన ఆలస్యానికి క్షమాపణలు చెబుతూనే, రాబోయే నెల రోజులు బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్‌తో సందడి చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే వారంలోనే టీజర్, ఆ తర్వాత మొదటి పాట, సెప్టెంబర్ చివరి వారంలో థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
నాగవంశీ ఇచ్చిన ఈ క్లారిటీతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.


