NBK111 : టైటిల్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..!

NBK111 : టైటిల్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..!

Published on Sep 5, 2026 8:01 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను సెప్టెంబర్ 6న సాయంత్రం 6.40 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు బాలయ్య అండ్ టీమ్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపించనుండటంతో ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు