ట్రైలర్ టాక్: సుహాస్ కోలీవుడ్ ఎంట్రీకి సాలిడ్ సెటప్!

ట్రైలర్ టాక్: సుహాస్ కోలీవుడ్ ఎంట్రీకి సాలిడ్ సెటప్!

Published on Sep 6, 2026 5:06 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ ఆక్టర్ సుహాస్ కూడా ఒకరు. అయితే సుహాస్ కోలీవుడ్ లో తన మొదటి సినిమాగా అది కూడ అక్కడ విలన్ గా చేస్తున్న సినిమానే ‘మండాడి’. టాలెంటెడ్ నటుడు సూరి హీరోగా దర్శకుడు మతి మారన్ తెరకెక్కించిన ఈ సముద్రపు నేపథ్య సినిమా నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ ని ఇప్పుడు విడుదల చేసారు.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్  లాంచ్ చేసి సుహాస్ కి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ఈ ట్రైలర్ మంచి ఇంటెన్స్ గా కట్ చేసారని చెప్పొచ్చు. సముద్రపు పడవల పోటీ నేపథ్యంలో రెండు జట్లు లీడ్ చేసే నాయకులుగా సూరి, సుహాస్ లు తమదైన ఫామ్ లో కనిపిస్తున్నారు. తమిళ్ లో సుహాస్ డబ్బింగ్ చెప్పుకోలేదు కానీ తెలుగులో చెప్పాడు.

ఇక తనపై, సూరి పై మాస్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. కానీ సూరికి తెలుగు డబ్బింగ్ బెటర్ గా చేయాల్సింది. ఇంకా విజువల్స్ కూడా మంచి గ్రిప్పింగ్ గా ఇందులో కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చిత్ర యూనిట్ సాలిడ్ సెటప్ తో వస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఈ సెప్టెంబర్ 10న తమిళ్, తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు