కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. చాలా తక్కువ బడ్జెట్ లు, చాలా తక్కువ ఓపెనింగ్స్ అందుకుని ఆ తర్వాత ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకునే సినిమలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో లేటెస్ట్ గా బాలీవుడ్ డెలివరీ చేసిన సంచలన హిట్ చిత్రమే ‘హనుమాన్ అన్శ్’.
దర్శకుడు విశాల్ చతుర్వేది, నటుడు సౌబినా సత్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కేవలం 10 లక్షల ఓపెనింగ్స్ మాత్రమే అందుకుంది. పైగా అంతకు ముందు మేకర్స్ ఎన్నో అవమానాలు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఇక సీన్ కట్ చేస్తే ఈ సినిమా అందుకున్న బాక్సాఫీస్ జంప్ చూసి ట్రేడ్ అంతా షాక్. ఏకంగా 750 పర్సెంట్ జంప్ లు ఊహించని నంబర్స్ తో ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 100 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ కి వచ్చేసింది.
ఐదవ శనివారం అయితే ఏకంగా బాలీవుడ్ ఇటీవల సెన్సేషనల్ హిట్ అది కూడా స్టార్ కాస్ట్ లో వచ్చిన ధురందర్ సాధించిన 12 కోట్ల మార్క్ ని ఈ చిన్న సినిమా 15 కోట్ల మార్క్ తో క్రాస్ చేసి ఒక సరికొత్త హిస్టరీ సెట్ చేసింది. ఇక నేడు ఆదివారం వసూళ్లతో 100 కోట్ల మార్క్ ని అధికారికంగా దాటుతున్నట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలా ఈ డివోషనల్ డ్రామా మంచి మౌత్ టాక్ తో రియల్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.


