మరి ఏ హీరో దైవత్వాన్ని ఎక్కువ చూపిస్తాడో ?

మరి ఏ హీరో దైవత్వాన్ని ఎక్కువ చూపిస్తాడో ?

Published on Sep 7, 2026 12:01 PM IST

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్-ఇండియా మైథాలజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు కుమారస్వామి పాత్రలో తమిళ హీరో ధనుష్ కూడా నటిస్తున్నాడు. ఈ జనరేషన్ హీరోలు దేవుడి పాత్రలో తానే దేవుణ్ణి అని నమ్మించాలంటే.. నడక, చూపు, హావభావాలు, మరియు మాడ్యులేషన్ ద్వారానే ఆ పాత్రలోని దైవత్వాన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయాలి.

అంటే కేవలం తమ నటన ద్వారానే దైవత్వాన్ని బయటకు తీస్తేనే ఆ పాత్రను ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. మరి ‘ఎన్టీఆర్ – ధనుష్’లలో ఏ హీరో దైవత్వాన్ని ఎక్కువ చూపిస్తారో ? అంటూ చర్చ మొదలైంది. ఇలాంటి చిత్రాల్లో నటన పరంగా ఎన్టీఆర్ కే ఎక్కువ మార్కులు పడతాయి. ఐతే, ఎన్టీఆర్‌ను దేవుడిగా చూపించడం కంటే… ఆయన తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుడికి “ఇతను దేవుడే” అనే భావన కలిగించడమే త్రివిక్రమ్ ముందున్న అసలైన సవాల్.

కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇక నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు