‘లెనిన్’ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మరోసారి ?

‘లెనిన్’ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మరోసారి ?

Published on Sep 7, 2026 9:00 AM IST

Jr-NTR (1)

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఐతే, కథలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ, వెంకీ పాత్ర తాలూకు గత సంఘటనల గురించి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చేబుతాడట. ఎన్టీఆర్ వాయిస్ అయితేనే.. ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుతుందని.. ‘ఆదర్శ కుటుంబం’లోని ప్రధాన కాన్ ఫ్లిక్ట్ కూడా ఆడియన్స్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అన్నట్టు లెనిన్ కి కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తే, థియేటర్‌లో మరింత ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు