2026 దసరా క్లాష్: అన్ని డౌట్స్ క్లియర్.. తలైవర్ తో పోటీకి సై అంటున్న యువ హీరోలు

2026 దసరా క్లాష్: అన్ని డౌట్స్ క్లియర్.. తలైవర్ తో పోటీకి సై అంటున్న యువ హీరోలు

Published on Sep 8, 2026 3:02 PM IST

ఈ ఏడాది మూవీ లవర్స్ కి సమ్మర్ తర్వాత సాలిడ్ ట్రీట్ థియేటర్స్ లో వరుసగా దక్కింది. ఇలా తెలుగు సహా తమిళ మార్కెట్ లలో సినిమాలు వరుసగా హిట్స్ అవుతూ ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ దసరా రేస్ లో కూడా పరిస్థితి రసవత్తరంగా మారింది.

అయితే ఈ రేస్ లో మొదట సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ సీక్వెల్ సినిమా జైలర్ 2 ఉంది. దీనితో రేస్ లో ఉన్న ధనుష్ సినిమా ఓం వాయిదా కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ సినిమా రణబాలి కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ కంటెంట్ కూడా విడుదల అయ్యి దసరా రేస్ లో కన్ఫర్మ్ గా వస్తున్నట్టు చెబుతున్నారు.

సో దీనితో అన్ని డౌట్స్ ఇప్పుడు క్లియర్ అయ్యి 2026 దసరా క్లాష్ సూపర్ స్టార్ వర్సెస్ యంగ్ హీరోస్ తో మంచి రసవత్తరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. మరి చివరి నిమిషంలో ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయేమో కూడా చూడాలి.

తాజా వార్తలు