‘ది ప్యారడైజ్’ కి ఈ వర్క్ ఇంకా పెండింగ్?

‘ది ప్యారడైజ్’ కి ఈ వర్క్ ఇంకా పెండింగ్?

Published on Sep 8, 2026 7:59 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ రూమర్స్ కి చెక్ చెప్పి అనుకున్న సమయానికే వస్తున్నట్టు ఖరారు చేసారు.

అయితే ఈ గ్యాప్ లో బిగ్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఇంకా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని పూర్తి చేయాల్సి ఉందట. అయితే దీనిని తను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసి కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అలాగే పాన్ ఇండియా విడుదలని కూడా కన్ఫర్మ్ చేశారు.

తాజా వార్తలు