‘రామాయణ’ ఐమాక్స్ రిలీజ్ కి జపాన్ ‘గాడ్జిల్లా’ ప్రమాదం!

‘రామాయణ’ ఐమాక్స్ రిలీజ్ కి జపాన్ ‘గాడ్జిల్లా’ ప్రమాదం!

Published on Sep 9, 2026 11:23 AM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న భారీ సినిమా అది కూడా మొదటి ఐమాక్స్ చిత్రం రామాయణ అలాగే జపాన్ సినిమా నుంచి రానున్న గాడ్జిల్లా మైనస్ జీరో కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల కాబోతుండడంతో పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది అని ఎప్పుడు నుంచో టాక్ ఉంది.

కానీ తాజాగా గాడ్జిల్లా ట్రైలర్ వచ్చాక మరోసారి సినీ వర్గాల్లో రెండు సినిమాల నడుమ డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా రెండూ ఐమాక్స్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా తీసినవి కావడంతో ఈ స్క్రీన్ షేరింగ్ లో చాలా పోటీ ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఎక్కువ లీడ్ గాడ్జిల్లా వైపే ఉండొచ్చు అని సో రామాయణ సినిమాకి అది ఎఫెక్ట్ అవుతుంది అనే టాక్ ఇప్పుడు మొదలైంది. సో ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం గాడ్జిల్లా ఫీవర్ ని తట్టుకోని రణబీర్ రామాయణ ఏ మేరకు పోటీలో రాణిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు