“రణబాలి” టీజర్ పైనే అందరి కళ్లు.. విజయ్ కంబ్యాక్ ఇస్తాడా?

“రణబాలి” టీజర్ పైనే అందరి కళ్లు.. విజయ్ కంబ్యాక్ ఇస్తాడా?

Published on Sep 9, 2026 8:12 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా రణబాలి కోసం అందరికీ తెలిసిందే. విజయ్ కి గత సినిమా ప్లాప్ ఉన్నప్పటికీ దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ ని మేకర్స్ నేడు విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.

ఇక ఈ టీజర్ పైనే అందరి దృష్టి పడింది. విజయ్ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చే కంటెంట్ ఇందులోనే కనిపిస్తుంది అని అంతా బలంగా నమ్ముతున్నారు. సో అదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి అజయ్ అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు