‘ఇరుముడి’ని మించే బ్లాక్ బస్టర్ ఇస్తా – క్రాక్ దర్శకుడు ప్రామిస్

‘ఇరుముడి’ని మించే బ్లాక్ బస్టర్ ఇస్తా – క్రాక్ దర్శకుడు ప్రామిస్

Published on Sep 11, 2026 7:58 AM IST

మాస్ మహారాజ రవితేజ తెలుగు సినిమా దగ్గర పరిచయం చేసిన ఎంతోమంది దర్శకుల్లో స్టార్ దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా ఒకరు. గోపిచంద్ తోనే మూడు సాలిడ్ హిట్స్ కొట్టిన రవితేజ నాలుగో సినిమా చేయాల్సిందే కానీ అది పలు కారణాలు రీత్యా జరగలేదు. ఇక లేటెస్ట్ గా రవితేజ సంచలన హిట్ సినిమా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ లో మైత్రి సంస్థతో ఖచ్చితంగా మరో సినిమా చేస్తానని క్రాక్ దర్శకుడు తెలిపాడు.

అంతేకాకుండా ఈసారి కొడితే ఇరుముడి సినిమాని మించే బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తానని మళ్లీ దాన్ని మించే సినిమాలు శివ నిర్వాణ, అనీల్ రావిపూడిలు తీయాలని చెప్పి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. దీనితో తన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని బాలయ్యతో దాదా అనే పవర్ఫుల్ సబ్జెక్టులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు