అఫీషియల్: రామ్ పోతినేని క్రేజీ థ్రిల్లర్ లో సంయుక్త!

అఫీషియల్: రామ్ పోతినేని క్రేజీ థ్రిల్లర్ లో సంయుక్త!

Published on Sep 11, 2026 12:23 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ‘లోన్ వుల్ఫ్’ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని రామ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు.

ప్రతీ రోజు నిర్విరామంగా తీస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన ఏ హీరోయిన్ కనిపిస్తుంది అనేది ఆ మధ్య టాక్ వినిపించింది. భీమ్లా నాయక్, అఖండ 2 బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్టు ఆ మధ్య రూమర్స్ వినిపించగా ఇప్పుడు మేకర్స్ అధికారికంగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేసారు.

నేడు సంయుక్త పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇస్తూ తమ ప్రాజెక్ట్ లోకి ఆమెని ఆహ్వానిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో రామ్ సరసన ఈ బ్యూటీ ఖరారు అయ్యింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు