సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్

Published on Sep 11, 2026 4:32 PM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 11, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, బోమన్ ఇరానీ, శ్రియా పిల్గోంకర్, సయామీ ఖేర్, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు
దర్శకత్వం : ప్రియదర్శన్
నిర్మాతలు : వెంకట్ కె నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్
సంగీతం : ప్రీతమ్, రాల్ఫీ రాఫెల్
ఛాయాగ్రహణం : దివాకర్ మణి
కూర్పు: ఎం.ఎస్. అయ్యప్పన్ నాయర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించడంతో పాటు, మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించడంతో ‘హైవాన్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఒప్పం'(2016) సినిమాకి ఇది అధికారిక రీమేక్. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

​కథ:

​శ్యామ్ (సైఫ్ అలీ ఖాన్) ఓ అంధుడు. ఒక అపార్ట్మెంట్ కి మైంటెనెన్స్ సూపెర్ వైజర్ గా పనిచేస్తాడు. అదే బిల్డింగ్ లో ఉండే రిటైర్డ్ జడ్జి ప్రధాన్(బోమన్ ఇరానీ) తో శ్యామ్ కి మంచి పరిచయం ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో జడ్జి ప్రధాన్ హత్యకు గురవుతాడు. ఆ నేరం శ్యామ్ పై పడుతుంది. అసలు జడ్జిని చంపింది ఎవరు? జడ్జి కుమార్తె నందినిని కాపాడటానికి శ్యామ్ ఎటువంటి సాహసాలు చేశాడు? హంతకుడు పరశురామ్ (అక్షయ్ కుమార్) తో ప్రధాన్ కి ఎలాంటి గతం ఉంది? అసలు శ్యామ్ ఆ చిన్నారిని ఎందుకు రక్షించాలని చూస్తాడు? అన్నదే ఈ చిత్ర కథ.

​ప్లస్ పాయింట్స్:

అంధుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ కనబరిచాడు.​ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో చాలా క్రూరంగా, కొత్త లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు.

​ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కథనం వేగంగా సాగుతుంది. హీరో, విలన్ మధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అక్కడక్కడా ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

​కథ మూడ్ కి తగ్గట్టు వచ్చే థ్రిల్స్ ఎంగేజ్ చేస్తాయి. పాపని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే స్టార్ హీరో క్యామియో ఆకట్టుకుంటుంది.

​మైనస్ పాయింట్స్:

​ఇదివరకే మలయాళంలో ఈ సినిమా చూసిన వారికి లేదా ఒరిజినల్ కథ తెలిసిన వారికి ఇందులో కొత్తదనం పెద్దగా కనిపించదు. చాలా సన్నివేశాలను ఉన్నవి ఉన్నట్లుగానే దించారు.

సినిమా ప్రారంభం మరియు ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. శ్యామ్ పాత్రను, అతడి బ్యాక్ స్టోరీ పరిచయం చేయడానికే దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు.

​కొన్ని లాజిక్ లొసుగులు, రన్-టైమ్ ఎక్కువగా ఉండటం సినిమా చూస్తున్నప్పుడు కాస్త విసుగు తెప్పిస్తాయి. పాటలు కూడా ఆకట్టుకోవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి తన రైటింగ్ పవర్ చూపెట్టారు. కానీ డైరెక్షన్ లో మాత్రం ఈసారి తన మార్క్ మిస్ అయ్యాడు. ఇలాంటి కథను ఆయన ఇంకా బెటర్ గా ట్రీట్ చేయాల్సింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే, ‘హైవాన్’ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబోలో వచ్చిన ఒక రొటీన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా కొంతవరకే మెప్పిస్తుంది. ప్రియదర్శన్ రైటింగ్ మరియు యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ, రెగ్యులర్ రీమేక్ ఫార్మాట్ మరియు స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకి మైనస్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ సినిమాను చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు