మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చేస్తున్న మొదటి చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.
ఉదయమే రావాల్సి ఉన్న ఈ టీజర్ ని సాయంత్రంకి వాయిదా వేసి ఫైనల్ గా దీన్ని విడుదల చేసారు. ఇక ఈ టీజర్ మాత్రం మంచి ప్యాకెడ్ గా ఉందని చెప్పాలి. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో మొదలైన ఈ టీజర్ అక్కడ నుంచి ఫ్యామిలీ సీన్స్ సహా సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ తో అన్నీ కలగలిపిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా రాబోతుంది అనిపిస్తుంది.
ఇక త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తన మార్క్ డైలాగులు కూడా ఇందులో పుష్కలంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వెంకీ మామ కూడా ఫుల్ ఫామ్ లో కనిపిస్తుండగా శ్రీనిధి శెట్టి కూడా తన పక్కన సరిగ్గా సరిపోయింది. సో ఇలా టీజర్ తో మరింత బజ్ ని రేకెత్తించారు. టీజర్ సంగతి అటుంచితే సినిమా రిలీజ్ ఇంకా సంగీత దర్శకుడు విషయంలో కూడా క్లారిటీలు వచ్చేసాయి.
టీజర్ విడుదలకి ముందే ఆదర్శ కుటుంబం ఓ వారం ఆగి వస్తుంది అనే కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ సినిమా ఎలాంటి వాయిదా లేకుండా అక్టోబర్ 2నే వస్తుంది అలానే సంగీతం కూడా థమన్ తోనే ఉన్నట్టుగా ఖరారు చేసేసారు. ఇక ఈ చిత్రానికి హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా టీజర్ లో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


